హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు నెలల వ్యవధిలోనే తండ్రీకూతుళ్ల మృతి

SRCL: చందుర్తిలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. 2 నెలల క్రితమే తండ్రి మృతి చెందగా, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి బత్తుల ఇషిక సోమవారం కన్నుమూసింది. తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి చిన్నారి దూరమవడం తీరని శోకాన్ని మిగిల్చింది. కొద్ది వ్యవధిలోనే తండ్రీకూతుళ్లు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.