MBNR: నవాబ్ పేట డీసీసీబీ ఛైర్మన్ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు సూర్య నాయక్ డిమాండ్ చేశారు. దుష్యంత్ రెడ్డి నియామకంపై జరుగుతున్న ముందస్తు ప్రచారాన్ని ప్రశ్నిస్తూ, పీఏసీఎస్ ఛైర్మన్గా లేని వ్యక్తికి డీసీసీబీ పదవి ఎలా సాధ్యమని నిలదీశారు. పదవుల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని, స్పష్టత ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
'డీసీసీబీ పదవి బలహీన వర్గాలకే కేటాయించాలి'

