హైదరాబాద్: 28°C
తెలంగాణ

రత్నపూర్‌కు త్వరలోనే బీటీ రోడ్డు: ఎమ్మెల్యే

ADB: తలమడుగు మండలంలోని రత్నాపూర్ గ్రామంలో బోథ్ MLA అనిల్ జాదవ్ సోమవారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. గుట్టపై ఉన్న రత్నపూర్ గిరిజన గ్రామానికి త్వరలోనే బీటీ రోడ్డు పూర్తి చేయిస్తానని భరోసా ఇచ్చారు. కేసీఆర్ హయాంలో మంజూరైన రూ. 4 కోట్ల రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని కాంట్రాక్టర్‌కు MLA అనిల్ జాదవ్ సూచించారు.