హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో లక్ష 25 వేల ఇందిరమ్మ చీరల పంపిణీ

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళా సంఘాల మహిళలకు పంచేందుకు లక్ష 25 వేల ఇందిరమ్మ చీరలను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలోని మహిళా సంఘాల్లో ఉన్న 92,322 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే చీరలు ఆయా మండలాల్లోని మహిళా సమాఖ్యలకు అందాయి.