హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్నుల పండువగా రాములోరి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో సోమవారం రామయ్య నిత్య కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి వారికి సుప్రభాత సేవ, ఆరాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణులను మిథిలా స్టేడియంలో కొలువుతీర్చిన అర్చకులు కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.