హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌పైనే కలెక్టర్‌కు ఫిర్యాదు

సూర్యాపేట ప్రజావాణిలో కలెక్టర్‌పైనే రైతులు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. మేళ్లచెరువు సర్వే నంబర్‌ 1057లోని తమ పట్టా భూములను విచారణ లేకుండా భూభారతి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపిస్తూ, కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌కు వినతిపత్రం అందజేశారు. బాధ్యులైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరగా, కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.