హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిత్రుడి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం

JN: పాలకుర్తి మండలం అయ్యగారిపల్లికి చెందిన గోనే దామోదర్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్‌తో కోమాలో ఉండటంతో ఆయన పూర్వ విద్యార్థి మిత్రులు మానవత్వం చాటుకున్నారు. 1984-85 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన పుస్కూరి శ్రీనివాసరావు, చిట్యాల యాకయ్య, ఎండీ షరీఫ్, ఇందిరారెడ్డి, సోమిరెడ్డి నాగయ్య, భుజంగరావు, వెంకటేశ్వర్లు కలిసి రూ.60 వేల ఆర్థిక సాయం సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు.