హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం డిప్యూటీ మేయర్ పీఠం ఎవరికి?

మచిలీపట్నం డిప్యూటీ మేయర్ ఎవరికి? కూటమి ఒప్పందంలో భాగంగా మేయర్ పీఠం టీడీపీకి దక్కగా, డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. జనసేన తరపున గెలిచిన 13 మంది కార్పొరేటర్లలో కొట్టే వెంకట్రావు, పినిశెట్టి ఛాయాదేవి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. ఇద్దరూ ఈ పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తుండటంతో ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.