ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక కందులాపురం సెంటర్‌లో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కందులాపురం సెంటర్లోని ఓ దుకాణం ముందు వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి యాచకుడిగా స్థానికులు తెలిపారు. అయితే మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కంభంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి!


