హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసింగపాడులో ఘనంగా రెండో కార్తీక సోమవారం వేడుకలు

పల్నాడు: నకరికల్లు మండలం, నరసింగపాడులోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో రెండో కార్తీక సోమవారం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు కొమ్మవరపు పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు నిర్వహించారు.