ELR: దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల ఫుట్‌బాల్ టోర్నీకి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జట్టును ప్రకటించారు. శుక్రవారం ఏలూరు సీఆర్ఆర్ కళాశాల మైదానంలో ఎంపికలు జరిగాయి. 18 మంది క్రీడాకారులు, నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ రత్నాకర్, వ్యాయామ ఉపాధ్యాయురాలు నాగిని ఆదివారం తెలిపారు. టోర్నీ డిసెంబరు 19న కేరళలోని కన్నూరులో జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్
నన్నయ వర్సిటీ ఫుట్‌బాల్ జట్టు ఖరారు


