హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా పెరిగిన కొత్త మిర్చి ధర

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి.  క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,200 పలకగా, కొత్త మిర్చి క్వింటాకు రూ.21,114 ధర పలికింది. అటు క్వింటా పత్తి ధర రూ.9,000గా నమోదైనట్లు మార్కెట్ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈనెల 20తో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ.200 తగ్గగా, కొత్త మిర్చి రూ.3,103 పెరిగింది. పత్తి ధర స్థిరంగా కొనసాగుతుంది.