TPT: పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ అమ్ములు ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకారం మంగళవారానికి వాయిదా వేశారు. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ స్కూటినీ ప్రక్రియకు సోమవారం తిరుపతి ఆర్డీవో రామ్మోహన్ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అమ్ములు ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుత్తూరులో ప్రమాణ స్వీకారం వాయిదా


