హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో ఏటీఎం చోరీకి విఫలయత్నం

అన్నమయ్య: మదనపల్లె బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె తండాలోని ఓ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. మేకులు, గుణపాలతో ఏటీఎంను ధ్వంసం చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలను చూసి పారిపోయారు. ఏటీఎం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ నగదు భద్రంగా ఉన్నట్లు సమాచారం.