హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

గుంటూరు: కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా తెనాలి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పరమేశ్వరుని దర్శించుకుని కార్తీక దీపారాధనలు చేశారు. దేవాలయాల్లో స్వామివారికి, అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో శివనామస్మరణ చేశారు.