హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద నిఘా

SKLM: జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద 24 గంటల పాటు నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు SP మహేశ్వర రెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినా, అక్రమంగా నగదు, మద్యం, ఇతర ప్రలోభ వస్తువులు తరలించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.