హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త బ్రిడ్జి కోసం గ్రామస్థుల నిరీక్షణ

MDK: గత వర్షాలకు నిజాంపేట మల్కచెరువు మత్తడి కొట్టుకుపోయి బ్రిడ్జి కూలిపోయింది. స్వయంగా కేంద్ర బృందం వచ్చి పరిశీలించినా, ఇప్పటికీ కొత్త వంతెన నిర్మాణానికి నోచుకోలేదు. నస్కల్, నందగోకుల్, రాంపూర్ గ్రామస్థుల రాకపోకలకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నూతన బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.