హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్లపై పశువుల సంచారం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

బాపట్ల: జిల్లాలోని ప్రధాన రహదారులు, పట్టణ వీధుల్లో గేదెలు, ఆవులు విచ్చలవిడిగా సంచరిస్తుండటం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. పొగమంచులో పశువులు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. యజమానులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.