హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బి. సింగవరంలో రహదారి సమస్య పరిష్కరిస్తా'

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బి. సింగవరం గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సాగిన రాజారావును గ్రామస్థుడు గెమ్మెలి సత్తిబాబు కలిసి తమ ప్రధాన సమస్య రహదారి సౌకర్యం లేకపోవడమేనని తెలిపారు. దీనిపై స్పందించిన రాజారావు, తాను సర్పంచ్‌గా గెలిచిన వెంటనే రహదారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటువేసి గెలిపించాలని కోరారు.