హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రెండో విడతలో సర్పంచ్‌లకు 1,171 నామినేషన్లు!

అనకాపల్లి జిల్లాలోని 8 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు 66 కేంద్రాల ద్వారా సర్పంచ్ పదవులకు 1,171, వార్డులకు 6,108 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా అచ్యుతాపురంలో సర్పంచ్‌లకు 225, వార్డులకు 1,009 నామపత్రాలు అందినట్లు అధికారులు తెలిపారు. రాంబిల్లిలో 158, నక్కపల్లి, ఎస్.రాయవరంలో 146 చొప్పున సర్పంచ్ నామినేషన్లు వచ్చాయని పేర్కొన్నారు.