హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి'

ASF: కాంగ్రెస్ పార్టీని జిల్లాలో క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై గాంధీ భవన్ లో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర నాయకత్వం పలు సూచనలు చేసిందన్నారు.