హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ వివాదం.. తమ్ముడి దాడిలో అన్న మృతి!

NLG: కనగల్ మండలం నర్సింహాపురంలో భూ వివాదం అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసింది. భూ పట్టా మార్పిడి విషయంలో జరిగిన గొడవలో సైదులు తన అన్న తిరుపతయ్య (58)పై ఈ నెల 12న కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తిరుపతయ్య హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందాడు. నిందితుడు సైదులును రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.