GNTR: పొన్నూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు, తహసీల్దార్ జియావుల్ హక్, సీఐ కిషోర్ బాబు, ఎస్ఎస్టీ బృందం సంయుక్తంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం అక్రమ తరలింపును అరికట్టేందుకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు


