AP: APCC అధ్యక్షురాలు షర్మిల చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. బాబు ఆదేశాలతోనే జగన్ కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లో మీడియాతో షర్మిల కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. బెంగళూరులోని జగన్ ఇంటి ముందు ధర్నా విషయం ముందే మీడియాలో రావడమే దీనికి నిదర్శనమన్నారు. ఇదంతా డైవర్షన్ డ్రామా అని విమర్శించారు.
వార్తలు
చంద్రబాబు డైరెక్షన్లో షర్మిల: కారుమూరు


