హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లూరి జడ్పీ పీఠం YCPదే

అల్లూరి జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను YCP దక్కించుకుంది. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎన్నికల్లో పెదబయలు జెడ్పీటీసీ వంతాల శాంతి చైర్‌పర్సన్‌గా, పాడేరు జెడ్పీటీసీ సీదరి రాంబాబు వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో ఏడు స్థానాలను YCP గెలుచుకోవడంతో రెండు కీలక పదవులను కైవసం చేసుకుంది.