హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు'

AKP: రాంబిల్లి మండలం లాలంకోడూరులో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా గ్రామ పెద్దలతో అవగాహన సమావేశం నిర్వహించినట్లు రాంబిల్లి ఎస్సై దినకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.