హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సర్పంచ్ అభ్యర్థి కుటుంబంపై దాడి

GNTR: తెనాలి మండలం బుర్రిపాలెంలో సర్పంచ్ అభ్యర్థి నల్లపు నీలాంబరం కుటుంబ సభ్యులపై మరో వర్గం దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గత రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దీనిపై దళిత సంఘాలు ఏకమై గ్రామంలో ఆందోళనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.