హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 24న దివ్యాంగుల క్రీడా ఎంపికలు

ELR: ఈ నెల 24న ఏలూరులో దివ్యాంగుల పారాస్పోర్ట్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా జాకబ్ తెలిపారు. ఏలూరు ASR స్టేడియంలో 13 ఏళ్లు పైబడిన దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం, క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశాలు ఉంటాయన్నారు.