హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కమిషనర్‌కు కాలనీవాసుల వినతి

ATP: గుత్తి పట్టణంలోని ముల్లా మైదానంలో రోడ్డుపై చేపడుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతూ శనివారం కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ సురేంద్రకు వినతి పత్రం అందజేశారు. కాలనీవాసులు షాకీర్ మాట్లాడుతూ.. రోడ్డుపై అక్రమంగా నిర్మాణాలు చేపడితే ప్రజలకు ఇబ్బందిగా ఉందన్నారు. అధికారులు స్పందించి తక్షణమే రోడ్డుపై చేపడుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు.