హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రంగంలోకి భారీగా పోలీసు బలగాలు

ATP: జిల్లాలో మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో నామినేషన్లు జరుగుతున్నాయి. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.