హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మసీదులో మత పెద్దలు ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం 20వ వార్డులో కూటమి అభ్యర్థి పాండ్రంకి శంకర్‌కు మసీదు మతపెద్దలు మద్దతు తెలిపినట్లు టీడీపీ నాయకులు షేక్ నిజాం, బహదూర్ బాషా తెలిపారు. ఆయన విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందించామన్నారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. శంకర్ మాట్లాడుతూ.. ఆశీస్సులు ప్రోత్సాహాన్నిచ్చాయన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.