హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీ అండర్-19 హాకీ జట్టుకు తేజశ్రీ ఎంపిక

సత్యసాయి: ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన యువ క్రీడాకారిణి తేజశ్రీ రాష్ట్రస్థాయి అండర్-19 బాలికల హాకీ పోటీల్లో ప్రతిభ చాటి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిన తేజశ్రీని మంత్రి సత్యకుమార్ అభినందించారు. జాతీయ స్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.