హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలను స్టేషన్‌కు తరలించిన పోలీసులు

పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో సర్పంచ్ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారాజుతో పాటు ఉప్పరపాలెం గ్రామానికి చెందిన పల్లపు లక్ష్మీనారాయణ, వంకాయలపాటి సాయి తేజ, ఆలకుంట వెంకటరావు, పల్లపు శంకర్, గుంజి వేణు, విప్పర్ల పేతురుబాబులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.