హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల తిరస్కరణపై వైసీపీ నాయకుల ఆందోళన

TPT: రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం నామినేషన్ కేంద్రం వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారి నామినేషన్లను పరిశీలనలో భాగంగా రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.