VZM: డెంకాడ మండలంలో మూడోదశలో జరగనున్న పంచాయతీలలో సర్పంచి ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్ల నేపథ్యంలో కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు ఎస్ఐ ఏ. సన్యాసినాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి వివాదాలకు తావులేకుండా సజావుగా నామినేషన్లు వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'డెంకాడలో సెక్షన్ 144 అమలు'


