PLD: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని, కూటమి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సూచించారు. శనివారం నిర్వహించిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చైర్మన్ అభ్యర్థి రూపేష్ గుప్తాతో పాటు 48 వార్డుల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'మున్సిపల్ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి'


