హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు యామలపేట విద్యార్థి

SKLM: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యామాలపేట విద్యార్థి మరదలై కుమార్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు మీసాల శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో విజయనగరంలో పోటీలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు, ఎస్ఎంసి చైర్మన్ షావుకారి గోవిందరావు విద్యార్ధుడిని అభినందించారు.