హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ

KDP: మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలోని నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిరంతర నిఘా చేపట్టారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.