TPT: తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ జేఈవో ఏ.శరత్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శనివారం టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈవో


