హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టెక్నికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం'

KRNL: రాష్ట్రంలో 2027 జనవరి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (TCC) పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పరీక్షల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందనాయక్ తెలిపారు. డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు జరగనున్నాయి. అర్హులు రూ.100-రూ.200 ఫీజుతో డిసెంబర్ 7లోపు bse.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి.