కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న 'పెళ్లిళ్ల వెంకన్న'గా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం కార్తీక మాసం శుద్ధ ద్వాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక పుష్పాలంకరణలో 'పెళ్లిళ్ల వెంకన్న'


