హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పొంగుటూరులో నామినేషన్ ఉపసంహరణపై ఆగ్రహం

ELR: కొయ్యలగూడెం మండలం పొంగుటూరు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా నామినేషన్ ఉపసంహరించుకున్నారని ఆరోపించారు. పార్టీ నాయకులంతా కులపరంగా ఒక్కటై తమకి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికను ఏకగ్రీవం చేయకుండా గ్రామంలో తప్పనిసరిగా ఎన్నిక నిర్వహించాలన్నారు.