బంగాళాఖాతంలో ఏర్పడిన ఆక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు 1.05 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యల కోసం 295 బృందాలను రంగంలోకి దించింది. శుక్రవారం మధ్యాహ్నం గోపాల్‌పురం సమీపంలో తుఫాన్ తీరం దాటవచ్చని ఐఎండీ తెలిపింది. ఆ సమయంలో గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
వార్తలు
'ఆక్వాన్' ఎఫెక్ట్.. సురక్షిత ప్రాంతాలకు లక్ష మంది


