హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీకి మాజీ సీఎం కుమార్తె గుడ్‌బై

కేరళ మాజీ సీఎం కె.కరుణాకరన్ కుమార్తె పద్మజ వేణుగోపాల్ బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరడం తన తొందరపాటు నిర్ణయమని ఆమె వ్యాఖ్యానించారు. తాను చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకున్నట్లు వెల్లడించారు. అయితే, పార్టీలో తనకు ఎవరిపైనా ఫిర్యాదులు లేవని స్పష్టం చేశారు. కాగా, ఆమె మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.