హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికల వ్యవస్థ పూర్తిగా ధ్వంసం: రాహుల్

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. చికాగో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌లో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తోందని అధికారులే చెబుతున్నట్లు వ్యాఖ్యానించారు. వ్యవస్థలోని లోపాలు బయటపెట్టడమే తమ వ్యూహమని ఆయన స్పష్టం చేశారు.