హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపర్వలో పెద్దపులి సంచారంపై ఏసిపి హెచ్చరిక

NTR: విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి రావద్దని, గుంపులుగా వెళ్లాలని మైలవరం ఏసీపీ పి. రామచంద్రరావు గ్రామస్తులకు సూచించారు. పులిని పట్టుకునేందుకు డేటా డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు గ్రామంలో ఉండి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.