హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ తేదీల్లో LRS దరఖాస్తుల పరిష్కార మేళా

GNTR: జీఎంసీ ఆధ్వర్యంలో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం(SRS) క్రింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు గుంటూరు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో ప్రత్యేక LRS మేళా నిర్వహించనున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ ఓ ప్రకటనలో తెలిపారు. మేళా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జీఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలో ఉంటుందని చెప్పుకొచ్చారు.