హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో యువతికి వేధింపులు

NTR: విజయవాడ దుర్గాపురానికి చెందిన యువతిని వేధిస్తూ రూ.50 వేలు డిమాండ్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గౌతమ్ (పప్పు) అనే వ్యక్తి తనపై ఉన్న కేసులు వెనక్కి తీసుకోవాలని, డబ్బులు ఇవ్వాలని ఫోన్‌లో బెదిరించినట్లు యువతి తెలిపింది. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తానని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.