విజయనగరం: తరచూ గంజాయిని అక్రమ రవాణాకు పాల్పడుతూ, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న నేపథ్యంలో నిందితులపై పీడీ.యాక్ట్ అమలుచేశామని బుధవారం తెలిపారు. ఎస్పీ వివరాల మేరకు తెర్లాం మండలం టెక్కలివలస, గరివిడి మండలం బాగువలస గ్రామాలకు చెందిన వ్యక్తులకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించినా, ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బెయిలు రాకుండాచేసి, విశాఖ జైలుకు తరలించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి నిందితులపై పీ.డీ.యాక్ట్: ఎస్పీ


