హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఎంపీపీ ఎన్నికల వేడి..

అన్నమయ్య: జిల్లాలో మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల పరోక్ష ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. మొత్తం 25 మండలాల్లో దాదాపు 20 నుంచి 22 స్థానాల్లో కూటమి ప్రభుత్వం ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. తంబళ్లపల్లె, పెద్దమండ్యం, సదుం మండలాల్లో వైసీపీకి అవకాశం ఏర్పడింది. కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్న మండలాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర పోటీ నెలకొంది.